సెక్యూరిటీల మార్కెట్లో వ్యాపారం చేసే మదుపరులు (పెట్టుబడిదారులు) గుర్తుంచుకోవలసిన కొన్ని ముందు జాగ్రత్తలను ఈ క్రింద పేర్కొంటున్నాము: బ్రోకర్ లేదా సబ్ బ్రోకర్ను ఎంపికచేసుకోవడం Selecting a Broker/ Sub - Broker జాగ్రత్తగా పరిశీలించి, సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) లో తమ పేరు నమోదుచేసుకున్న బ్రోకర్తో లేదా సబ్ బ్రోకర్తో మాత్రమే మీ సెక్యూరిటీల వ్యాపారాన్ని నిర్వహించండి. తన బ్రోకర్ల జాబితాను బి ఎస్ ఇ ప్రచురించింది. ఆ జాబితా ద్వారాకాని , బి ఎస్ ఇ వెబ్సైట్ ద్వారాకాని బ్రోకర్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఒప్పందం కుదుర్చుకోవడం Entering into an Agreement మీరు ఎంపికచేసుకున్న బ్రోకర్ లేదా సబ్ బ్రోకర్ వద్ద ఖాతాదారు నమోదు పత్రాన్ని పూర్తిచేయండి . ఆ బ్రోకర్ లేదా సబ్ బ్రోకర్తో ఖాతాదారు ఒప్పందం కుదుర్చుకోండి. బి ఎస్ ఇ తో వ్యాపారం చేసే సభ్యునికి ఖాతాదారుగా తమ పేరు నమోదుచేసుకోవడం, మదుపరులందరికీ తప్పనిసరి. ఒప్పందం కుదుర్చుకునే ముందు ఈ క్రింది అంశాలపట్ల శ్రద్ధ వహించండి తగిన విలువ కలిగిన స్టాంపు పేపరుమీద ఈ ఒప్పందాన్ని వ్రాసుకోవలసి వుంటుంది. అంతకంటె ముందే, ఆ ఒప్పందానికి సంబంధించిన నియమ నిబంధనలను శ్రద్ధగా చదివి అర్ధంచేసుకోండి ఒప్పందపత్రంలోని ప్రతి పేజీలో ఖాతాదారు, ఒప్పందంపై సంతకం చేయడానికి అర్హతవున్న బి ఎస్ ఇ సభ్యుడు లేదా ప్రతినిధి సంతకం చేయాలి. సాక్షులు కూడా, ఒప్పందంలో, తమ పేరును, చిరునామాను పొందుపరుస్తూ , సంతకం చేయాలి. బ్రోకర్ / సబ్ బ్రోకర్/ ఖాతాదారు ఒప్పందం తప్ప, మరెలాంటి దస్తావేజును దాఖలుచేయాలని, నియంత్రణాధికారులు కోరడంలేదు. లావాదేవీలు జరపడం Transacting మీరు ఏ ఎక్స్ ఛేంజ్ద్వారా వ్యాపారం చేయాలనుకుంటున్నారో, బ్రోకర్ లేదా సబ్ బ్రోకర్కు స్పష్టంగా చెప్పండి. ప్రతి ఎక్స్ఛేంజ్కి వేరువేరుగా ఖాతాలు ఏర్పాటుచేసుకోండి. వ్యాపారం చేసిన 24 గంటలలోగా, బ్రోకర్ లేదా సబ్ బ్రోకర్నుంచి తగిన కాంట్రాక్ట్ నోట్ పొందండి. కాంట్రాక్ట్ నోట్ అనేది, ఒక ఖాతాదారు తరఫున, ఏ రోజు చేసిన వ్యాపారానికి ఆ రోజున, బి ఎస్ ఇ నిర్దేశించిన నమూనా ఫారంలో ఇచ్చే ధ్రువీకరణ పత్రం. కాంట్రాక్ట్ నోట్లో పేర్కొన్న విధంగా, బి ఎస్ ఇ లో చేసే వ్యాపార లావాదేవీలను పరిష్కరించడంలో, వ్యాపారంచేసే సభ్యునికి, ఖాతాదారుకు మధ్య చట్టబద్ధమైన సంబంధాన్ని ఈ నోట్ ఏర్పరస్తుంది. ి కాంట్రాక్ట్ నోట్ రెండు ప్రతులుగా ( అసలు, దానికి నకలు ) వుంటుంది. వ్యాపారం చేసే సభ్యుడు, ఖాతాదారు చెరొక ప్రతి పొందవచ్చు. తనకు అసలు ప్రతి అందిందని ధ్రువీకరిస్తూ, ఖాతాదారు నకలు పైన సంతకం చేయవలసివుంటుంది. ఏ) కాంట్రాక్ట్ నోట్ - ఫారం ' ఏ ' - ఖాతాదారుల తరఫున బ్రోకర్ గా / ఏజంట్ గా వ్యవహరిస్తున్న సభ్యుడు జారీచేసేది బి) కాంట్రాక్ట్ నోట్ - ఫారం ' బి ' - ఖాతాదారుల వ్యాపారాన్ని నిర్వహించే సభ్యులు, తాము ప్రధాన వ్యాపార నిర్వాహకులమని ( ప్రిన్సిపల్స్) ప్రకటిస్తూ జారీచేసేది. కాంట్రాక్ట్ నోట్లో ఈ క్రింది వివరాలను పేర్కొనేలా శ్రద్ధ వహించండివ్యాపారంచేసే సభ్యుని / సబ్ బ్రోకర్ సెబి రిజిస్ట్రేషన్ నంబరుఆర్డర్ నంబరు, ట్రేడ్ (వ్యాపారం) నంబరు, వ్యాపార సమయము, పరిమాణము, ధర, బ్రోకరు కమిషన్ (బ్రోకరేజ్), పరిష్కారం సంఖ్య , ఇతర సుంకాల వివరాలువ్యాపార ధరను బ్రోకరేజి తో కలపకుండా, విడిగా చూపించాలి షేర్ / డిబెంచర్ కు గరిష్ఠంగా, రూ. 0.25 వంతున, లేదా షేర్ / డిబెంచర్ కు సంబంధించిన కాంట్రాక్టు ధరలో గరిష్ఠంగా, 2.5 % ...ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే, ఆ మొత్తాన్ని బ్రోకర్ కమిషన్ కింద చెల్లించవలసి వుంటుంది. గరిష్ఠంగా చెల్లించే ఈ బ్రోకరేజిలో, సబ్ బ్రోకర్ కమిషన్కూడా చేరి వుంటుంది ( సబ్ బ్రోకరేజి, కాంట్రాక్టు ధరలో 1.5 % కు మించకూడదు). ఇవి కాకుండా, బ్రోకరేజి పైన సర్వీసు సుంకం, ఖాతాదారుకు విధించే ఏవైనా జరిమానాలు, సెక్యూరిటీల లావాదేవీల సుంకం ( ఎస్ టి టి ) మాత్రమే వ్యాపారంచేసే సభ్యుడు అదనంగా విధించవచ్చు కాంట్రాక్ట్ నోట్ లో బ్రోకరేజి, సర్వీస్ టాక్స్, ఎస్ టి టి లను విడివిడిగా చూపించాలి. అధికారం పొందిన ప్రతినిధి సంతకం వుండాలిి ఎక్స్ఛేంజి ఒక పార్టీగా వుండే అన్ని రకాల న్యాయ వ్యవహారాలపై ముంబై కోర్టులకు మాత్రమే విచారణ పరిధి వుంటుందని; ఇతర అన్నిరకాల న్యాయ వ్యవహారాలలో, ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రం ( రీజియనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ) ఏ కోర్టుల పరిధిలో వుంటే ఆ కోర్టులకు, న్యాయ విచారణాధికారం వుంటుందనే ఆర్బిట్రేషన్ నిబంధన కాంట్రాక్ట్ నోట్ ముఖపత్రంలో తప్పనిసరిగా పొందుపరచి వుండాలి. పరిష్కారం Settlement కొనుగోలు / అమ్మకానికి సంబంధించిన కాంట్రాక్ట్ నోట్ చేతికి అందిన వెంటనే సెక్యూరిటీలను / చెల్లించవలసిన సొమ్మును బ్రోకర్కు అందజేసేలా శ్రద్ధ వహించాలి. ఎట్టిపరిస్థితిలో, నిర్ణీత చెల్లింపుల (పే ఇన్) రోజునకు ముందే అందజేయాలి. అమ్మకాలు జరిగిన (పే ఔట్) 24 గంటలలోగా, ఖాతాదారుకు సభ్యుడు డబ్బును లేదా సెక్యూరిటీలను అందజేయాలి డి మాట్ ఖాతా ప్రారంభించాలి షేర్ల కొనుగోలు, అమ్మకాలను డి మాట్ లోనే సాగించేలా చూడండి. డి మాట్ ఖాతానుంచి షేర్ల పంపిణీ జరగాలంటే, ఆ షేర్లను, సెక్యూరిటీలను విక్రయించిన బ్రోకర్ పూల్ ఖాతాకు, లబ్ధిదారు ఖాతానుంచి, బదలాయింపు జరగడానికి అవసరమైన ఆదేశాలను డిపాజిటరీ పార్టిసిపెంట్ (డి పి) ఇవ్వాలి. డి పి కి ఈ క్రింది వివరాలను సమకూర్చాలి: షేర్లను బదలాయించవలసిన బ్రోకర్ పూల్ ఖాతా వివరాలు ; స్క్రిప్ వివరాలు, పరిమాణం(ఎన్ని) మొదలైనవి. డిపాజిటరీల నిర్వహణకు అనువుగా, నిర్ణీత సెక్యూరిటీలకు చెల్లింపులు జరపడానికి తుది గడువుకు కనీసం 48 గంటలు ముందుగా, పంపిణీ (డెలివరీ ఔట్) ఆదేశాలు ఇవ్వాలి. మీరు కొనుగోలుచేసిన షేర్లు మీ డి మాట్ ఖాతాలోకి జమకావడంకోసం, మీ తరఫున ఆ షేర్లను కొనుగోలుచేసిన బ్రోకర్ పూల్ ఖాతా నుంచి, లబ్ధిదారు (బెనిఫిషియరీ) ఖాతాలోకి అనుమతించవలసిందిగా, డిపాజిటరీ పార్టిసిపెంట్కు " డెలివరీ ఇన్ '' ఆదేశాలు ఇవ్వాలి. ఆ షేర్ల పత్రాలు నేరుగా మీ చేతికి అందిన పక్షంలో, పంపిణీ మంచి చెడ్డలను గురించి సెబి జారీచేసిన నిబంధనలతో వాటిని పోల్చిచూడండి పంపిణీ లోపాలను తక్షణమే బి ఎస్ ఎ ద్వారా చక్కదిద్దుకోవాలి. మీ పేరున బదలాయింపబడడానికి, నేరుగా మీ చేతికందిన షేర్ల నమోదు విషయంలో, వాటి బదలాయింపు ఒప్పందం (డీడ్) అన్ని విధాల చెల్లుబాటుకు అనుగుణంగా, అన్ని వివరాలతో, తగిన విలువగల స్టాంపులతో వున్నదో లేదో నిర్ధారించుకోండి. మదుపుదారుల హక్కులు Rights of Investors మదుపుదారులకు కంపెనీ ప్రకటించే అన్ని ప్రయోజనాలను / సమాచారాన్ని పొందగలగడం కంపెనీలోని హోల్డింగ్స్ బదలాయింపులు, ఉప విభాగాలుగా చేయడం, క్రోడీకరించడం వంటి సేవలను సక్రమంగా పొందడం ఈక్విటీ హోల్డర్గా, ఆ కంపెనీ విడుదలచేసే తదుపరి క్యాపిటల్ ఇష్యూలో తాను ఖాతాదారుగా చేరే హక్కు కలిగి వుండడం కాంట్రాక్టు ధరలో బ్రోకరేజి 2.5 % కు మించకపోవడం లావాదేవీల ధర, బ్రోకరేజి, సర్వీస్ టాక్స్, ఎస్ టి టి విడి విడిగా పేర్కొన్న నిర్దిష్టమైన ఫారంలో కాంట్రాక్ట్ నోట్ అందినట్టు బ్రోకర్నుంచి రసీదు పొందడం Expect delivery of shares purchased/value of shares sold within 24 hours from pay-out. అమ్మిన లేదా కొనుగోలు చేసిన (పే ఔట్) 24 గంటలలోగా, కొనుగోలు చేసిన షేర్లను / అమ్మిన షేర్ల విలువను అందుకోగలనని ఆశించడం భౌగోళిక పరిధికి సంబంధించిన, ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రానికి (ఆర్బిట్రేషన్ సెంటర్) వెళ్ళగలగడం ఎక్స్ఛేంజ్ తో వ్యాపారం సాగించే సభ్యులపైన చేసే ఫిర్యాదులను, లేదా మధ్యవర్తిత్వంకోసం చేసే దరఖాస్తులను ఈ కింద 1 వ నిలువు గడిలో పేర్కొన్న సంబంధిత ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రంలో దరఖాస్తుచేయాలి. ఆ ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రం, వ్యాపారంచేసే సభ్యునికి చట్టబద్ధంగా , లిఖితపూర్వకంగా తెలియజేసిన భాగస్వామి తాజా చిరునామా లేదా నమోదైన కార్యాలయం , 2 వ నిలువు గడిలో పేర్కొన్న ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో (భారతదేశంలో) వున్నదో, ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందినదై వుండాలి . అయితే, భారతీయ సంతతికి చెంది, ఇండియాలో నివసించని భాగస్వామి విషయంలో, వ్యాపారంచేసే సభ్యుని సభ్యత్వం కార్పొరేట్ సభ్యత్వమా, నాన్ కార్పొరేట్ సభ్యత్వమా అనేదానినిబట్టి, ఆ సభ్యుని చిరునామా లేదా రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా 2 వ నిలువుగడిలొని ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోవుంటే, ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రమై వుండాలి. దరఖాస్తుదారు నిబంధనలకు అనుగుణంగా మధ్యవర్తిత్వ దరఖాస్తును ఏ ఆర్బిట్రేషన్ సెంటర్లో దాఖలుచేస్తే, ఆ ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రంలొ విచారణలు చేపడతారు. నిలువుగడి 1 నిలువుగడి 2 ప్రాంతీయ మధ్య వర్తిత్వ న్యాయ కేంద్రాలు ప్రాంతీయ మధ్య వర్తిత్వ న్యాయ కేంద్రాల పరిధిలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్్ఉ ఉత్తర ప్రాంతీయ కార్యాలయం ,7వ అంతస్తు, మెర్కంటైల్ హౌస్్కె జి మార్గ్ కె జి మార్గ్ , న్యూఢిల్లీ-110 001.టెలిఫోన్ నంబర్ : 011-41510481టెలి ఫాక్స్ నంబర్ : 011-41510480ఇ- మెయిల్ ఐ డి :iscdelhi@bseindia.com ;ritesh.kumar@bseindia.com ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ , ఉత్తరాంచల్, హిమాచల ప్రదేశ్, పంజాబ్, జమ్ము-కాశ్మీర్, చండీఘర్ , రాజస్థాన్్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్తూర్ తూర్పు ప్రాంతీయ కార్యాలయం ,1వ అంతస్తు, కిషోర్ భబన్17, ఆర్ ఎన్ ముఖర్జీ రోడ్ ,కోల్కతా- 700 001టెలిఫోన్ నంబర్ : 033-22133184 ,టెలి ఫాక్స్ నంబర్ : 033-22130530ఇ- మెయిల్ ఐ డి :isc.kolkata@bseindia.com;anirban.guha@bseindia.com West Bengal, Bihar, Jharkhand, Orissa, Assam, Arunachal Pradesh, Mizoram, Manipur, Sikkim, Meghalaya, Nagaland, Tripura, Chhattisgarh పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, ఒరిస్సా, అస్సాం, అరుణాచల ప్రదేశ్ , మిజోరం, మణిపూర్, సిక్కిం,మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, చత్తీస్ఘర్్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్దక్షిణ ప్రాంతీయ కార్యాలయం ,4వ అంతస్తు, ఎక్స్ఛేంజ్ బిల్డింగ్్నంబర్ 11, సెకండ్ లైన్ బీచ్ ,చెన్నై- 600 001టెలిఫోన్ నంబర్ : 044-42163999టెలి ఫాక్స్ నంబర్ : 044-42164999ఇ- మెయిల్ ఐ డి :iscchennai@bseindia.com;s.periyasamy@bseindia.com ఆంధ్రప్రదేశ్, కర్ణాటక , కేరళ, తమిళనాడు, అండమాన్-నికోబార్, లక్షద్వీప్ , పుదుచ్చేరి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్పశ్చిమ ప్రాంతీయ కార్యాలయం ,డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టర్ సర్వీసెస్,పి జె టవర్స్, 1 వ అంతస్తు, దలాల్ స్ట్రీట్ఫోర్ట్, ముంబై- 400001.టెలిఫోన్ నంబర్ : 022-22721233/34టెలి ఫాక్స్ నంబర్ : 022-22723677ఇ- మెయిల్ ఐ డి :crasto@bseindia.com మహారాష్ట్ర, గుజరాత్, గోవా, డామన్-డయూ , దాదర్-నగర్ హవేలి, మధ్య ప్రదేశ్ మదుపుదారులు చేయవలసిన, చేయకూడని అంశాలు General DO's and DON'Ts for Investors గతంలో కంటె ఇటీవల, స్టాక్ మార్కెట్లో పెట్టుబడిపెట్టే / వ్యాపారంచేసే మదుపుదారుల సంఖ్య బాగా పెరుగుతున్నది. అందువల్ల, స్టాక్ మార్కెట్ విషయంలో మదుపుదారులు ఏమేమి చేయాలో, ఏవి చేయకూడదో తెలుసుకోవడం అవసరం. మదుపుదారులు పాటించవలసిన, పాటించకూడని కొన్ని సాధారణ అంశాలను ఈ క్రింద పేర్కొనడం జరిగింది. చేయవలసినవి: DOs:- సెబి / స్టాక్ ఎక్స్ఛేంజ్లలో నమోదుచేసుకున్న మధ్యవర్తులతోనే వ్యవహరించండి. మీరు ఖాతాదారుగా నమోదు చేసుకోవడం పూర్తయినవెంటనే, అందుకు సంబంధించిన అన్ని దస్తావేజుల జిరాక్స్ కాపీలను తీసుకుని, మీవద్ద వుంచుకోండి. మీ బ్రోకర్ / ఏజెంట్ / డిపాజిటరీ పార్టిసిపెంట్ కు ఎలాంటి గందరగోళం లేని, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. లావాదేవీలు జరిగిన ప్రతిసారి, మీ బ్రోకర్ను మీకు కాంట్రాక్టు నోట్ ఇవ్వమనండి. లావాదేవీలపై ఏదైనా అనుమానం వస్తే, బి ఎస్ ఇ వెబ్సైట్లో సరిచూసుకోండి. మార్కెట్లోని మధ్యవర్తులకు చెల్లించవలసిన మొత్తాలను బ్యాంకులద్వారా మాత్రమే చెల్లించండి. ఏవైనా షేర్లను కొనవలసిందిగా, మార్కెట్ మధ్యవర్తులకు చెప్పేముందు, ఆ కంపెనీ తీరుతెన్నులేమిటి, దాని సామర్ధ్యం ఎంత, యాజమాన్యం ఎలా వుంది, మౌలిక ప్రాతిపదికలు (ఫండమెంటల్స్) ఎలా వున్నాయి, ఆ కంపెనీ ఇటీవల చేసిన ప్రకటనలేమిటి, వివిధ నిబంధనలకింద ఆ కంపెనీ వెల్లడించిన విషయాలేమిటి అనేవి పరిశీలించి తెలుసుకోవాలి. ఎక్స్ఛేంజుల, కంపెనీల వెబ్సైట్ల ద్వారా, డేటా వెండర్ సమాచార దర్శనుల(డేటా బేస్) ద్వారా, వ్యాపారానికి సంబంధించిన పత్రికల ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు మీరు ఎంత నష్టాన్ని భరించగలుగుతారో, అందుకు అనుగుణమైన వ్యాపార / పెట్టుబడి వ్యూహాలను అనుసరించాలి. ఎందుకంటే, షేర్ మార్కెట్లో పెట్టే ఏ పెట్టుబడిలోనైనా, ఎంతో కొంత నష్ట భయం వుండనే వుంటుంది. మీరు అనుసరించే వ్యూహాన్నిబట్టి ఆ నష్టభయం హెచ్చు తగ్గులు ఆధారపడి వుంటాయి. ఏ మధ్యవర్తితోనైనా మీరు ఖాతాదారుగా నమోదుచేసుకోవడానికి ముందు, తగిన పరిశీలన అవసరం. బ్రోకర్ల ద్వారా వ్యాపారం జరపడానికి అవసరమైన, పెట్టుబడిదారు నమోదు దస్తావేజులలోని, ' రిస్క్ డిస్క్లోజర్ డాక్యుమెంట్ ' (నష్ట భయాన్ని వెల్లడించే పత్రం) లోని అంశాలను జాగ్రత్తగా చదివి, అర్ధం చేసుకోండి. హఠాత్తుగా ధర పెరిగే షేర్లతో జాగ్రత్త; ముఖ్యంగా తక్కువ ధర షేర్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులకు ఖచ్చితంగా లాభం వస్తుందన్న హామీ ఏమీ వుండదు. పెట్టుబడులకు సంబంధించిన అన్నిరకాల పత్రాల (దరఖాస్తులు, రసీదులు, కాంట్రాక్ట్ నోట్ మొదలైనవి) ప్రతులను (జిరాక్స్ కాపీలను) తీయించి మీవద్ద వుంచుకోండి. ముఖ్యమైన పత్రాలను పంపేటప్పుడు అవి తప్పక చేరే విధంగా పంపండి. (రిజిస్టర్డ్ పోస్ట్లో పంపడం మంచిది) . మీవద్ద డబ్బు వున్నదని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే, కొనండి మీ వద్ద సెక్యూరిటీలు వున్నాయని నిర్ధారించుకున్న తర్వాతనే అమ్మండి. లావాదేవీల పత్రాలు సరిగా అందేలా తగిన వాకబు చేయండి. ఉదాహరణకు, మీకు అందవలసిన దస్తావేజులు , తగిన వ్యవధిలోగా అందకపోతే, తక్షణమే, సంబంధితులతో ( వ్యాపార సభ్యుడు లేదా కంపెనీని) సంప్రదించండి. మీ లావాదేవీలను, నేరుగా దస్తావేజుల పత్రాల రూపంలోనే జరుపుతారా, లేక డి మాట్ రూపంలో జరుపుతారా అనే విషయం మీరు స్పష్టంగా పేర్కొనాలి. మీ వ్యాపార సభ్యునిపై ఏదైనా ఫిర్యాదు చేయాలనుకున్నా, లేక మధ్యవర్తిత్వంకోసం దరఖాస్తుచేయాలనుకున్నా, మీ భౌగోళిక పరిధికి సంబంధించిన మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రానికి దరఖాస్తు చేయాలి. మీ వ్యాపార సభ్యునికి , చట్ట ప్రకారం, మీరు తెలియజేసిన మీ చిరునామానుబట్టి, భౌగోళిక పరిధిని నిర్ణయించుకోవాలి. సంబంధిత మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రం భౌగోళిక వివరాలు, కాంట్రాక్ట్ నోట్లో కూడా వుంటాయి. నేరుగా ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రంలో దాఖలుచేసే ఫిర్యాదు, లేదా మధ్యవర్తిత్వ దరఖాస్తుకు " కాల పరిమితిని '' లెక్కించడంలో, ఐ జి ఆర్ సి సేవల ద్వారా ఫిర్యాదును పరిష్కరించే ప్రయత్నానికి పట్టిన కాలాన్ని లెక్కలోకి తీసుకోరు.బి ఎస్ ఇ లో నమోదైన ఏదైనా కంపెనీపై ఫిర్యాదు చేయాలనుకుంటే, మీ భౌగోళిక పరిధికి సంబంధించిన మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రానికి దరఖాస్తు చేయాలి. మీ చిరునామానుబట్టి, మీ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రం భౌగోళిక పరిధిని నిర్ణయించుకోవాలి. ఈ విధంగా చేస్తే, మీ ఫిర్యాదును త్వరగా చేపట్టడానికి వీలవుతుంది. చేయకూడనివి: DONTs :- మీ లావాదేవీలను, సెబి / స్టాక్ ఎక్స్ఛేంజ్లలో నమోదుచేసుకొనని బ్రోకర్లు / సబ్ బ్రోకర్లతోకాని, నమోదుచేసుకోని ఇతర మధ్యవర్తులతో కాని నిర్వహించవద్దు. పూర్తిగా చదివి అర్ధం చేసుకోనిదే, ఎలాంటి దస్తావేజులపైన సంతకాలు చేయవద్దు. మీ భౌగోళిక పరిధికి సంబంధించని ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రానికి , ఫిర్యాదులు లేదా మధ్యవర్తిత్వ దరఖాస్తులు చేసుకోవద్దు. మీ వ్యాపార సభ్యునికి , చట్ట ప్రకారం, మీరు తెలియజేసిన మీ చిరునామానుబట్టి, భౌగోళిక పరిధిని నిర్ణయించుకోవాలి. మదుపుదారుల ఫిర్యాదులను ఎక్స్ ఛేంజీలు, మధ్యవర్తిత్వం ద్వారా లేదా ఐ జి ఆర్ సి పద్ధతి ద్వారా పరిష్కరిస్తాయి. నేరుగా ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రంలో దాఖలుచేసే ఫిర్యాదు, లేదా మధ్యవర్తిత్వ దరఖాస్తుకు " కాల పరిమితిని '' లెక్కించడంలో, ఐ జి ఆర్ సి సేవల ద్వారా ఫిర్యాదును పరిష్కరించే ప్రయత్నానికి పట్టిన కాలాన్ని లెక్కలోకి తీసుకోరు. బి ఎస్ ఇ లో నమోదైన ఏదైనా కంపెనీపై మీరు ఫిర్యాదుచేయాలనుకుంటే, భౌగోళిక పరిధికి చెందని మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రానికి దరఖాస్తు చేయవద్దు. ఎందుకంటే, అవి త్వరగా పరిష్కారం కావు. మీ చిరునామా ఆధారంగా భౌగోళిక పరిధిని నిర్ణయించుకోండి. వదంతులపైన, ఊహాగానాలపైన ఆధారపడి లావాదేవీలు సాగించవద్దు. ఈ షేర్లలో పెట్టుబడి పెడితే, లాభం ఖాయం వంటి మాటలకు మోసపోవద్దు. కంపెనీలు తమ సెక్యూరిటీలకు ప్రభుత్వ ఆమోదం వున్నదనో, లేదా ప్రభుత్వ ఏజెన్సీల వద్ద నమోదుచేసుకున్నామనో చేసే ప్రచారానికి మోసపోవద్దు. ఎందుకంటే, ఆ ఆమోదం మీరు కొనాలనుకునే సెక్యూరిటీలకు సంబంధించినది కాక, ఇతర మరెందుకో సంబంధించినది కావచ్చు. మీ డి మాట్ లావాదేవీల స్లిప్ బుక్ ను ఏ మధ్యవర్తికీ ఇవ్వవద్దు. కంపెనీలు, తమ ఆర్ధిక సామర్ధ్యాన్ని గురించి, పత్రికలలో, టెలివిజన్ ఛానల్స్లో చేసే ప్రకటనల ఆధారంగా, మీ లావాదేవీలను నిర్ణయించుకోవద్దు. కంపెనీలలోని పరిణామాలను గురించి ప్రచార, ప్రసార సాధనాలలో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మవద్దు. వీటిలో కొన్ని మిమ్ము తప్పుదారి పట్టించవచ్చు. ఎవరైనా లాభంపొందినవారి పెట్టుబడి నిర్ణయాలను గుడ్డిగా అనుకరించవద్దు. మీకు బాగా పరిచయం వున్న వారైనా సరే, మీ లావా దేవీలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను వారినుంచి తీసుకోవడం మరువవద్దు. పెట్టుబడిలో ఎదురయ్యే ముప్పులను ముందుగానే గమనించడం మరువవద్దు. మీ పెట్టుబడులను పోస్ట్ డేటెడ్ (తర్వాతి తేదీ వేసిన) చెక్కులద్వారా చెల్లిస్తామనే హామీలకు మోసపోవద్దు అవసరాన్నిబట్టి, సంబంధిత వ్యక్తులను, తగిన అధికారులను కలుసుకోవడానికి వెనుకాడవద్దు భారీ లాభాలు వస్తాయి అనే హామీల వెంట పరుగులు పెట్టవద్ద ఆధారము: www.bseindia.com