జీఎస్టీ వ్యవస్థ కింద ఏయే చెల్లింపులు ఉంటాయి.? జీఎస్టీ వ్యవస్థ కింద రాష్ట్రంలో అంతర్గతంగా జరిగే సరఫరాలపై కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ కింద చెల్లించేది కేంద్రం ఖాతాలోకి జమ అవుతుంది) మరియు రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ కింద చెల్లించే పన్ను సంబంధిత రాష్ట్ర ఖాతాలో జమ అవుతుంది). అంతర్ రాష్ట్ర సరఫరాలపై ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ అంశాలు ఉంటాయి. దీనికితోడు కొన్ని తరగతులకు చెందిన రిజిస్టర్డ్ వ్యక్తులు ట్యాక్స్ డిడకైడ్ ట్ సోర్స్ (టీడీఎస్) మరియు ట్యాక్స్ కలెక్టేడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్) ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. దీనికి తోడుగా, అవసరమైన చోట్ల వడ్డీ, జరిమానా, రుసుము మరియు ఇతర చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. జీఎస్టీ చెల్లించే బాధ్యత ఎవరిపై ఉంటుంది? సాధారణంగా వస్తువులు లేదా సేవలు సరఫరా చేసేవారు జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. అయితే, దిగుమతులు, ఇతర ప్రకటిత సరఫరాల వంటి కొన్ని నిర్దిష్ట సందర్భాలలో ఎదురు చెల్లింపు వ్యవస్థ కింద జీఎస్టీ చెల్లింపు బాధ్యత సదరు వస్తుసేవల స్వీకర్తది కావచ్చు. అంతేకాకుండా రాష్టాంతర సేవల సరఫరా వంటి మరికొన్ని ప్రకటిత సేవల విషయంలో జీఎస్టీ చెల్లింపు బాధ్యత అటువంటి సేవలందించే ఆన్లైన్ వ్యాపార (ఈ-కామర్స్) సంస్థలది కావచ్చు. అలాగే వర్తకుల నుంచి పొందిన సరఫరాలపై ప్రభుత్వ విభాగాలు నిర్దిష్ట పరిమితి (సెక్షన్ 51 (1)(డి) ప్రకారం ఒక కాంట్రాక్టుపై రూ.2.5 లక్షలు)కి మించి చెల్లించే మొత్తం నుంచి "మూలంలోనే పన్ను కోత" (TDS) పెట్టి సంబంధిత ప్రభుత్వ విభాగానికి జమచేయాలి. అదేవిధంగా ఆన్లైన్ వ్యాపార కార్యకలాపాల నిర్వహణదారులు సరఫరా చేసే వస్తుసేవల నికర విలువ (సీజీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్ 9(5) కింద తన సేవలపై జీఎస్టీ చెల్లింపు బాధ్యతను మినహాయించాక తేలే పన్నువిధించదగిన వస్తుసేవల సగటు విలువ)పై "మూలంలోనే పన్ను వసూలు" (TCS) చేసి ప్రభుత్వానికి జమ చేయాలి. జీఎస్టీ చెల్లింపు బాధ్యత ఎప్పుడు ఏర్పడుతుంది? సెక్షన్ 12లో వివరించిన ప్రకారం వస్తువులు సరఫరా చేసినప్పుడు... సెక్షన్ 13లో వివరించిన ప్రకారం సేవాప్రదానం చేసినప్పుడు జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. చెల్లించాల్సిన సమయం... సాధారణంగా "ప్రతిఫలం స్వీకరణ, బిల్లు జారీ లేదా సరఫరా పూర్తి"... ఈ మూడింటిలో ఏదో ఒకదానికి ముందు. అయితే, దీనికి సంబంధించి భిన్న సంభావ్య పరిస్తితులు, భిన్నపన్నుఅంశాలు పైన పేర్కొన్న విభాగాల్లో ఇప్పటికే వివరించబడ్డాయి. జీఎస్టీ చెల్లింపు క్రమంలో ముఖ్యాంశాలు ఏవి.? జీఎస్టీ వ్యవస్థ కింద చెల్లింపు క్రమంలో ఈ దిగువ అంశాలుంటాయి. జీఎస్టీఎన్ కామన్ పోర్టల్‌లో రూపొందించిన ఎలక్ట్రానిక్ చలానా ద్వారా అన్ని రకాల చెల్లింపులు జరుగుతాయి. మ్యాన్యువల్ గా చలానా సిద్ధం చేయాల్సిన అవసరం లేదు. పన్ను చెల్లింపుదారుకు ఎలాంటి ఇబ్బందులు లేని సులభమైన, ఏసమయంలో ఎక్కడినుంచైనా చెల్లింపులు జరిపే సౌకర్యం కల్పించబడుతుంది. ఆన్ లైన్ లో చెల్లింపులు జరిపే సౌలభ్యం ఎలక్ట్రానిక్ రూపంలో పన్ను వసూలు డేటా అందుబాటులో ఉంటుంది. పన్నువసూలు మొత్తాన్ని వేగంగా ప్రభుత్వం ఖాతాకు జమచేసే సౌకర్యం కాగిత రహిత లావాదేవీలు సత్వర అకౌంటింగ్ మరియు రిపోర్టింగ్ అన్నిరకాల రసీదులను ఎలక్ట్రానిక్ గా సరిచూసుకోవడం బ్యాంకులకు సరళీకృత విధానం డిజిటల్ చాలాన్ భద్రపరచుకునే సౌకర్యం చెల్లింపు ఎలా జరపాలి..? ఈ దిగువన తెలిపిన పద్దత్తుల్లో చెల్లింపు జరపవచ్చు. కామన్ పోర్టల్‌లో నిర్వహించే పన్ను చెల్లింపుదారు క్రెడిట్ లెట్టర్ డెబిట్ ద్వారా చెల్లించవచ్చు. అయితే ఈ పద్ధతిలో కేవలం పన్ను మాత్రమే చెల్లించడానికి వీలవుతుంది. వడ్డీ, జరిమానా, ఇతర ఫీజులు క్రెడిట్ లెడ్డర్ డెబిట్ ద్వారా చెల్లించడం కుదరదు. ఇన్పుట్ ఫై చెల్లించిన పన్నుల క్రెడిట్ పొందేందుకు అనుమతి ఉంటుంది మరియు దీనిని అవుట్‌పుట్ ట్యాక్స్ చెల్లింపునకు ఉపయోగించుకోవచ్చు. అయితే సీజీఎస్టీ ఖాతాలోని క్రెడిట్ ఎస్జీఎస్టీ చెల్లింపులకు అదేవిధంగా అటు నుంచి టు ఉపయోగించడానికి వీల్లేదు. కాగా, ఐజీఎస్టీ క్రెడిట్ ను ఐజీఎస్టీ, సీజీఎస్టీ మరియు ఎస్జీఎస్టీలకు, అదే వరుస క్రమంలో ఉపయోగించుకునేందుకు అనుమతిస్తారు. కామన్ పోర్టల్‌లో పన్ను చెల్లింపుదారు నిర్వహించే క్యాష్ లెడ్డర్ ద్వారా నగదు డెబిట్ చేసి చెల్లించవచ్చు. క్యాష్ లెడ్డర్లో రకరకాల పద్దతులద్వారా నగదు జమ చేయవచ్చు. అవి. ఈ-పేమెంట్ (ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) / నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్), జీఎస్టీ జమ చేసేందుకు అనుమతి పొందిన బ్యాంకు శాఖల్లో కౌంటర్ వద్ద నేరుగా చెల్లింపు ద్వారా. సరఫరాదారు పన్నులు ఎప్పుడు చెల్లించాలి? సాధారణ పన్ను చెల్లింపుదారులు నెలవారీ ప్రాతిపదికన తదుపరి నెల 20వతేదీలోగా పన్నులు చెల్లించాలి. నగదు చెల్లింపులను తొలుత నగదు పుస్తకంలో నమోదు చేయాలి. అనంతరం నెలవారీ పన్ను చెల్లించే తేదీన పుస్తకంలో ఆ మొత్తాన్ని తగ్గించి చూపడంతోపాటు సంబంధిత నెలవారీ రిటర్నులో సదరు తగ్గింపు వరుస సంఖ్యను నమోదు చేయాలి. ఇంతకుముందు పేర్కొన్నట్లుగా చెల్లింపులను జమల పుస్తకం నుంచి కూడా తగ్గించి చూపవచ్చు. ఉదాహరణకు మార్చి నెలలో చెల్లించాల్సిన పన్నులను ఏప్రిల్ 20వ తేదీలోగా జమ చేయాలి. మిశ్రమ పన్ను చెల్లింపుదారులైతే తైమాసికం (3 నెలలకు ఒకసారి) ప్రాతిపదికన పన్నులు చెల్లించాలి. పన్ను చెల్లింపు వ్యవధిని పొడిగించవచ్చా లేక నెలవారీ వాయిదాలలో చెల్లించవచ్చా? వీల్లేదు... స్వీయ మదింపు బాధ్యతగల సందర్భంలో ఇందుకు అనుమతి ఉండదు. ఇతర సందర్భాలలో వ్యవధి పొడిగింపునకు లేదా వాయిదాలలో చెల్లింపును అనుమతించే అధికారం సముచిత అధికార స్థానానికి ఉంటుంది (సీజీఎస్‌సీ/ఎసీఎసీ చటం సెకన్ 8O). పన్ను విధించదగిన వ్యక్తి రిటర్ను సమర్పించినా పన్ను చెల్లించకపోతే ఏమవుతుంది? అటువంటి సందర్భాలలో సదరు రిటర్న్ చెల్లుబాటు కానిదిగా పరిగణిస్తారు. సెకన్ 2(117) నిర్వచనం ప్రకారం... స్వీయ మదింపు పన్నును పూర్తిగా చెల్లించాక సెక్షన్ 39లోని ఉప సెక్షన్ (1) కింద సమర్పించినదే చెల్లుబాటయ్యే రిటర్నుగా పరిగణించబడుతుంది. దీని ఆధారంగానే వస్తుసేవల స్వీకర్తకు ఉత్పాదక పన్ను జమ (ITC) మినహాయింపును అనుమతిస్తారు. మరో మాటలో చెబితే సరఫరాదారు స్వీయ మదింపు పన్ను మొత్తాన్నీ చెల్లించి, రిటర్న్ సమర్పించడంతోపాటు స్వీకర్త కూడా తన రిటర్న్ దాఖలు చేస్తే తప్ప స్వీకర్తకు ఐటీసీ ఖరారు కాదు. ప్రభుత్వ ఖాతాలో సొమ్ము జమ కావడం లేదా చెక్కు సమర్పించడం లేదా చెల్లింపు జరుగడం ఈ మూడింటిలో పన్ను బకాయిూలు చెల్లించిన తేదీగా దేనిని పరిగణిస్తారు.? ప్రభుత్వ ఖాతాకు సొమ్ము జమ అయిన తేదీని చెల్లింపు తేదీగా పరిగణిస్తారు. ఈ-లేడ్జర్స్అంటే ఏమిటి..? ప్రతి రిజిస్టర్డ్ పన్ను చెల్లింపుదారు యొక్క నగదు మరియు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ స్టేట్ మెంట్లను ఎలక్ట్రానికి లేడ్జర్స్ లేదా ఈ-లేడ్జర్స్ అని పిలుస్తారు. దీనికితోడు ప్రతి పన్నుచెల్లింపుదారు ఎలక్ట్రానిక్ ట్యాక్స్ లయబిలిటీ రిజిష్టర్ కలిగి ఉండాలి. పన్ను చెల్లింపుదారు ఒకసారి కామన్ పోర్టల్‌లో రిజిష్టర్ చేసుకుంటే 2 లెడ్డర్లు (క్యాష్ మరియు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్) మరియు ఎలక్ట్రానిక్ ట్యాక్స్ లయబిలిటీ రిజిష్టర్ అటోమెటిక్ గా రూపొందుతాయి. డ్యాష్ బోర్డుపై ఎల్లప్పుడూ అవి కనిపిస్తాయి. ట్యాక్స్ లయబిలిటీ రిజిష్టర్ అంటే ఏమిటి.? అది పన్ను చెల్లింపుదారు ఆ నెల చెల్లించాల్సిన మొత్తం ట్యాక్స్ లయబిలిటీని (నెట్టింగ్ అనంతరం) చూపిస్తుంది. క్యాష్ లేడ్జర్ అంటే ఏమిటి.? అన్నిరకాల నగదు జమలను మరియు పన్ను చెల్లింపుదారు పేరిట జరిపిన టీడీఎస్/టీసీఎస్ మొత్తాలు అన్నీ చూపేది క్యాష్ లేడ్జర్. ఇది వాస్తవ సమయం ఆధారంగా సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. జీఎస్టీకి సంబంధించిన ఎలాంటి చెల్లింపులనైనా దీనిద్వారా జరుపవచ్చు. ఐటీసీ లేడ్జర్ అంటే ఏమిటి.? నెలవారీ రిటర్న్ లలో సెల్స్ అసెస్ట్ పద్ధతిలో అంచనా వేసిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను ఐటీసీ లెడ్డర్ చూపిస్తుంది. ఈ లేడ్జర్ లోని క్రెడిట్‌ను కేవలం పన్ను చెల్లింపులకు మాత్రమే ఉపయోగించవచ్చు. వడ్డీ, జరిమానా, ఇతర రుసుములకు ఉపయోగించడానికి వీల్లేదు. జీఎస్టీఎస్(GSTN)కు అధీకృత బ్యాంకులకు మధ్య లింకేజీ ఏంటే ఏమిటి..? జీఎస్టీఎన్ కు, బ్యాంకు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్) మధ్య రియల్ టైమ్ టూవే లింకేజీ ఉంటుంది. తనిఖీ మరియు చెల్లింపుల స్వీకరణకు ఉద్దేశించిన ఎలక్ట్రానిక్ స్ట్రింగ్ ద్వారా సీపీఐఎన్ (CPIN) అటోమెటిక్ గా బ్యాంకుకు కలుపబడి ఉంటుంది. చెల్లింపును ధృవీకరిస్తూ చాలాన్ ఐడెంటిఫికేషన్ నంబరు (సీఐఎన్) అటోమెటిక్ గా బ్యాంకు నుంచి కామన్ పోర్టల్ కు పంపించబడుతుంది. బ్యాంకు క్యాషియరు లేదా టెల్లరు లేదా పన్ను చెల్లింపుదారు మ్యాన్యువల్ గా ఇందులో చేసేది ఏమీ ఉండదు. పన్ను చెల్లింపుదారు మల్టిపుల్ సిటింగ్స్ ద్వారా చాలాస్ తయారు చేసుకోవచ్చా? అవును. పన్ను చెల్లింపుదారు చాలాన్ ఫామ్ పాక్షికంగా నింపి తదుపరి పూర్తి చేసుకొనేందుకు వీలుగా ‘సేవ్’ చేసుకోవచ్చు. సేవ్ చేసిన చలాన్ కు తుదిరూపు ఇచ్చేముందు 'ఎడిట్’ చేసుకోవచ్చు. చాలాన్ ను ఫైనలైజ్ చేసిన తర్వాత జెనరేట్ చేసి పన్ను చెల్లింపుల నిమిత్తం ఉపయోగించుకోవచ్చు. తన రికార్డుల నిమిత్తం చెల్లింపుదారు చాలాన్ ను ప్రిట్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఆస్ లైన్ లో జెనరేట్ చేసిన చాలాస్ ను మార్చుకోవచ్చా? లేదు. చాలాన్ జెనరేట్ చేసేందుకు జీఎస్టీఎన్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత పన్ను చల్లింపుదారు లేదా అతనికి చెందిన అధీకృత వ్యక్తి చెల్లింపు వివరాలను అందులో చేర్చాల్సి ఉంటుంది. భవిష్యత్ ఉపయోగం నిమిత్తం చాలాన్ ను మధ్యలో సేవ్ చేసుకోవచ్చు. అయితే ఒకసారి చాలాన్ ఫైనలైజ్ చేసి సీపీఐఎన్ (CPIN) జెనరేట్ చేసిన తర్వాత పన్ను చెల్లింపు దారు సదరు చాలాన్ కు మార్పులుచేర్పులు చేయాలంటే కుదరదు. చాలాస్ కు చెల్లుబాటు గడువు అంటూ ఉంటుందా..? అవును. జెనరేట్ చేసిన తర్వాత పదిహేను రోజుల వరకు చాలాన్ చెల్లుబాటు అవుతుంది. ఆతర్వాత సిస్టమ్ దాన్ని తీసివేస్తుంది. అయితే తన వీలును బట్టి చెల్లింపుదారు మరో చాలాన్ జెనరేట్ చేసుకోవచ్చు. సీపీఐఎస్ (CPIN) అంటే ఏమిటి.? సీపీఐఎన్ అంటే కామన్ పోర్టల్ ఐడెంటిఫికేషన్ నంబరు. చాలాన్ జెనరేట్ చేసినప్పుడు ఇది ఇవ్వబడుతుంది. చలాన్ ను గుర్తించేందుకు ఇచ్చే 14 డిజిట్ల విశిష్ట సంఖ్య ఇది. పైన తెలిపినట్టుగా సీపీఐఎన్ 15 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. సీఐఎస్ (CIN) అంటే ఏమిటి. దాని ప్రాముఖ్యత ఏమిటి.? సీఐఎన్ అంటే చాలాన్ ఐడెంటిఫికేషన్ నంబరు. ఇది 14 డిజిట్ల సీపీఐఎన్ తో పాటుగా అదనంగా మూడుడిజిట్ల బ్యాంకు కోడ్ కలిపి 17 డిజిట్లతో ఉంటుంది. అధీకృత బ్యాంకులు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి చెల్లింపులు ముట్టి తమ దగ్గరున్న సంబంధిత ప్రభుత్వ ఖాతాల్లో వాస్తవికంగా జమ అయినప్పుడు అవి సీఐఎన్ ను జెనరేట్ చేస్తాయి. చెల్లింపు జరిగింది మరియు సంబంధిత ప్రభుత్వ ఖాతాలో జమ అయిందనడానికి ఇది ఒక సూచనగా ఉంటుంది. అధీకృత బ్యాంకు ద్వారా ఇది పన్ను చెల్లింపుదారుకు అలాగే జీఎస్టీఎన్ కు ఇది తెలియజేయబడుతుంది. పన్ను చెల్లింపుదారు మునుపటి నెలల పన్ను కూడా బకాయి ఉన్నప్పుడు చెల్లింపు క్రమం ఏమిటి? ప్రస్తుత రిటర్న్ కాలానికి ముందు పన్ను చెల్లింపుదారు పన్ను బాధ్యత నెరవేర్చని పక్షంలో సెక్షన్ 49(8) ఒక చెల్లింపు క్రమాన్ని నిర్దేశిస్తోంది. దీని ప్రకారం... తొలుత మునుపటి పన్ను కాలపు స్వీయ మదింపు పన్ను, ఇతర బకాయిలు చెల్లించాలి. అటుపైన ప్రస్తుత కాలపు స్వీయ మదింపు పన్ను, "ఇతర బకాయిలు" చెల్లించాలి. సెక్షన్ 73 లేదా 74 కింద నిర్ధారిత పన్ను చెల్లింపు అభ్యర్థనలుసహా ఇంకా బకాయిలు ఉన్నట్లయితే ఆ తర్వాత చెల్లించాలి. ఈ వరుస క్రమాన్ని తప్పనిసరిగా పాటించాలి. పైన పేర్కొన్న 'ఇతర బకాయిలు' అంటే ఏమిటి? "ఇతర బకాయిలు" అంటే.. వడ్డి, జరిమానా, రుసుము లేదా చట్ట ప్రకారం, సంబంధిత నిబంధనల మేరకు చెల్లించాల్సిన ఇతర మొత్తాలు. ఈ-ఎఫ్‌పీబీ (E-FPB) అంటే ఏమిటి? ఈ-ఎఫ్‌పీబీ అంటే... ఎలక్ట్రానిక్ ఫోకల్ పాయింట్ బ్రాంచ్ (ఎలక్ట్రానిక్ వ్యవహారాల ప్రధాన శాఖ). వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపులను స్వీకరించేందుకు అనుమతి పొందిన అధీకృత బ్యాంకులు ఏర్పాటు చేసే శాఖనే ఈ-ఎఫ్ పీబీగా వ్యవహరిస్తారు. ఆ మేరకు ప్రతి అధీకృత బ్యాంకు దేశవ్యాప్త లావాదేవీల నిర్వహణకు ఒకే ఒక శాఖను ఈ-ఎఫ్పీబీగా ప్రతిపాదిస్తుంది. సదరు ఈ-ఎఫ్‌పీబీ అన్ని ప్రభుత్వాలకూ ప్రతి ప్రధాన పద్దుకింద ఖాతాలు తెరవాలి. ఈ శాఖలలో మొత్తం 38 ఖాతాలు (సీజీఎస్టీ, ఐజీఎస్టీలకు ఒక్కొక్కటి వంతున, ఎస్టీఎస్టీ కోసం ప్రతి రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకోసం ఒకటి చొప్పున) తెరవాలి. జీఎస్టీ చెల్లింపుల కింద ఈ శాఖలు స్వీకరించే ఏ మొత్తాన్నయినా తాము నిర్వహించే సంబంధిత ఖాతాకు జమచేయాలి. అయితే, NEFT/RTGS లావాదేవీలకు మాత్రం రిజర్వు బ్యాంకు (RBI) ఈ-ఎఫ్పీబీగా వ్యవహరిస్తుంది. టీడీఎస్ (TDS) అంటే ఏమిటి? టీడీఎస్ అంటే 'మూలంలో పన్ను కోత" (TDS). సెక్షన్ 51 ప్రకారం... ఈ నిబంధన ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర ప్రకటిత సంస్థల కోసం ఉద్దేశించినది. దీని ప్రకారం... ప్రభుత్వం లేదా ఆయా అధికార స్థానాలు ఒప్పందం కింద తాము పొందిన సరఫరాలకుగాను కాంట్రాక్టర్లకు చేసే చెల్లింపుల విలువ రూ.2.5 లక్షలు దాటినప్పుడు అందులో 1 శాతం మేర తగ్గించి, సదరు మొత్తాన్ని సంబంధిత జీఎస్టీ ఖాతాకు జమచేయాలి. రిటర్ను దాఖలు సమయంలో సరఫరాదారు ఈ టీడీఎస్ ను తన ఖాతాల్లో ఎలా చూపుతాడు? టీడీఎస్ కింద చూపిన ఏ మొత్తమైనా సంబంధిత సరఫరాదారు ఎలక్ట్రానిక్ నగదు పుస్తకంలో ప్రతిఫలిస్తుంది. ఈ మొత్తాన్ని అతడు తన పన్ను బాధ్యత నెరవేర్చేందుకు, వడ్డీ లేదా రుసుము లేదా ఇతరత్రా చెల్లింపులు చేసేందుకు వినియోగించుకోవచ్చు. టీడీఎస్ తగ్గింపుదారు సదరు టీడీఎస్ ను ఖాతాల్లో ఎలా చూపుతాడు? టీడీఎస్ తగ్గింపుదారు సదరు టీడీఎస్ ను కింది విధంగా చూపుతాడు:- టీడీఎస్ తగ్గింపుదారులు సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెక్షన్ 24 కింద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఆ విధంగా టీడీఎస్ ద్వారా ఒక నెలలో సేకరించిన సొమ్మును తదుపరి నెల 10వ తేదీలోగా జమ చేయడంతోపాటు జీఎస్టీ రిటర్న్ 7లో నివేదించాలి. టీడీఎస్ కింద జమచేసిన మొత్తం సరఫరాదారు ఎలక్ట్రానిక్ నగదు పుస్తకంలో ప్రతిఫలించాలి. టీడీఎస్ కింద వసూలు చేసిన మొత్తాన్ని సరఫరాదారు ప్రభుత్వ ఖాతాకు జమచేసిన 5 రోజుల్లోగా తనవద్ద సొమ్ము కోతకు గురైనవారికి ఆ మేరకు ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ఆ విధంగా ఇవ్వని పక్షంలో రోజుకు రూ.100 వంతున రూ.5 వేలకు మించకుండా సరఫరాదారు రుసుముకింద చెల్లించాల్సి ఉంటుంది. మూలంలో పన్ను వసూలు (TCS) అంటే ఏమిటి? సీజీఎస్‌సీ/ఎసీఎసీ చటంలోని సెక్షన్ 52 కింద "మూలంలో పన్ను వసూలు" (TCS) నిబంధన ఆన్లైన్ వ్యాపార కార్యకలాపాల (ఈ-కామర్స్) నిర్వహణదారులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రతి ఈ-కామర్స్ నిర్వహణదారు ఎవరికీ ప్రతినిధి కాదుగనుక తమద్వారా నెలవారీగా సరఫరా అయ్యే వస్తుసేవలకు తాము రాబట్టే ప్రతిఫలం నుంచి "పన్ను విధించదగిన సరఫరాల నికర విలువ'లో 1 శాతం మించకుండా తమవద్ద అట్టిపెట్టుకోవాలి. ఇలా సేకరించిన సొమ్మును తదుపరి నెల 10వ తేదీలోగా సముచిత జీఎస్టీ ఖాతాలో సదరు ఈ-కామర్స్ నిర్వహణదారు జమచేయాలి. "పన్ను విధించదగిన సరఫరాల నికర విలువ" అంటే ఏమిటి? "పన్ను విధించదగిన సరఫరాల నికర విలువ" అంటే. ఈ-కామర్స్ వ్యాపారుల వద్ద నమోదైన పన్నువిధించదగిన వ్యక్తులు సెకన్ 9(5) కింద ప్రకటిత సేవలు మినహా ఏ నెలలోనైనా వారిద్వారా సరఫరా చేసిన పన్ను విధించదగిన వస్తువులు లేదా సేవల మొత్తం విలువ నుంచి ఆ నెలలో వాపసు వచ్చిన వస్తువుల విలువను తగ్గించగా మిగిలే విలువ. జీఎస్టీ చెల్లింపుల కోసం జీఎస్టీఎస్ పోర్టల్‌లో క్రెడిట్ కార్డు ముందస్తు నమోదు అవసరమూ? అవసరమే.... పన్ను చెల్లింపులకు ఉద్దేశించిన క్రెడిట్ కార్డును జీఎస్టీఎన్ నిర్వహించే ఉమ్మడి పోర్టల్‌లో పన్ను చెల్లింపుదారు ముందస్తుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రెడిట్ కార్డు తనిఖీ దిశగా సదరు సేవాప్రదాన సంస్థ (సర్వీస్ ప్రొవైడర్) నుంచి బ్యాంకులద్వారా నిర్ధారణ పొందడానికి జీఎస్టీఎన్ ఒక విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తుంది. వ్యాపార సౌలభ్య కల్పనలో భాగంగా నగదు పరిమితితో నిమిత్తంలేని చెల్లింపుల కోసం ఈ క్రెడిట్ కార్డును వినియోగించుకునేందుకు అనుమతి ఉంటుంది. ఆధారం : https://www.cbic.gov.in/