ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY - స్కీమ్ 1 - యాక్సిడెంటల్ డెత్ బీమా కోసం) అర్హత: బ్యాంకు ఖాతాగల 18 నుంచి 70 సంవత్సరాల ప్రజలు అర్హులు. ప్రీమియం: ఏడాదికి రూ.12 లు. చెల్లింపు రకం: చందాదారుల బ్యాంకు ఖాతా నుండి ప్రీమియం నేరుగా చేల్లించబడుతుంది. ఈ పద్ధతి మాత్రమే అందుబాటులో ఉంది. రిస్క్ కవరేజ్: రూ .2 లక్షలు - ప్రమాదవశాత్తు మరణం మరియు పూర్తి వైకల్యానికి రూ .1 లక్ష - పాక్షిక వైకల్యానికి. అర్హత: బ్యాంకు ఖాతా మరియు ఆధార్ సంఖ్య కలిగిన ఏవరైనా వ్యక్తి పథకంలో చేరడానికి ప్రతి సంవత్సరం జూన్ 1 వతేదీ ముందు ఒక సాధారణ ఫాం ఇవ్వాలి. నామినీ పేరును ఫాంలో ఇవ్వాలి. రిస్క్ కవరేజ్ నిబంధనలు: ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీర్ఘకాల కొనసాగింపు ఎంపిక చేసుకుంటే అతని ఖాతాలో నుంచి ఆటో డెబిట్ ప్రతి సంవత్సరం అవుతుంది. ఎవరు ఈ పథకం అమలు చేస్తారు ?: పథకం ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు పథకం చేరడానికి మరియు బ్యాంకులతో టై అప్ అవడానిక సిద్ధంగా ఉన్న అన్ని ఇతర భీమా కంపనీల ద్వారా అందిస్తున్నారు. ప్రభుత్వం సహాయం: వివిధ మంత్రిత్వ శాఖలు ఎవరూ తీసుకోని డబ్బు నుండి ఈ బడ్జెట్లో నుండి లేదా పబ్లిక్ వెల్ఫేర్ ఫండ్ నుండి వారి లబ్దిదారులకు వివిధ కేటగిరీల సహ దోహద ప్రీమియాన్ని అందించవచ్చు. ఇది విడిగా సంవత్సరంలో నిర్ణయించబడుతుంది. సాధారణ ప్రచార ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. మూలం: PIB ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY - స్కీమ్ 2 - జీవిత బీమా కవర్) అర్హత: 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు మరియు ఒక బ్యాంకు ఖాతా కలిగి ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటుంది. 50 సంవత్సరాల పూర్తి చేయకుండానే పథకంలో చేరిన వ్యక్తులకు లైఫ్ కవర్, ప్రీమియం చెల్లింపుకు లోబడి, 55 సంవత్సరాల వరకు పథకం వర్తిస్తుంది. ప్రీమియం: ఏడాదికి Rs.330. ఆటో డిబేటు అవుతుంది. చెల్లింపు రకం: ప్రీమియం చెల్లింపు చందాదారులు ఖాతా నుండి బ్యాంకు ద్వారా నేరుగా ఆటో డెబిట్ అవుతుంది. రిస్క్ కవరేజ్: ఏ కారణంచేతనైనా మరణించినప్పుడు రూ .2 లక్షలు. రిస్క్ కవరేజ్ నిబంధనలు: ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అతను దీర్ఘకాల ఎంపిక తీసుకుంటే తన ఖాతాలో బ్యాంకు ఆటో డెబిట్ ప్రతి సంవత్సరం అవుతుంది. ఎవరు ఈ పథకాన్ని అమలు చేస్తారు: పథకం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మరియు ఈ ప్రయోజనం కోసం బ్యాంకులతో టై అప్ కు సిద్ధంగా ఉన్న అన్ని ఇతర జీవిత బీమా కంపెనీలు అందిస్తున్నాయి. ప్రభుత్వం సహాయం: వివిధ మంత్రిత్వ శాఖలు ఎవరూ తీసుకోని డబ్బు నుండి ఈ బడ్జెట్లో నుండి లేదా పబ్లిక్ వెల్ఫేర్ ఫండ్ నుండి వారి లబ్దిదారులకు వివిధ కేటగిరీల సహ దోహద ప్రీమియం అందించవచ్చు. ఇది విడిగా సంవత్సరంలో నిర్ణయించబడుతుంది. సాధారణ ప్రచార ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. మూలం: PIB