సరికొత్త ప్రగతి గాథకు ప్రతీక నక్సల్ విముక్త భారత్ నక్సలిజం, మావోయిస్టు హింసపై పోరులో ఒక నిర్ణయాత్మక దశను భారత్ విజయవంతంగా అధిగమించింది. గడచిన పుష్కర (12 ఏళ్ల) కాలంలో జాతీయ భద్రత రీత్యా ఇదొక విశిష్ట విజయం. నక్సలిజం కబంధ హస్తాల నుంచి దేశం ఎట్టకేలకు విముక్తమై, పూర్తి ఉపశమనం పొందే స్థితికి చేరింది. బాంబులు తుపాకుల ఆధిపత్యాన్ని రూపుమాపి, న్యాయం- శాంతి నెలకొల్పడంలో రాజ్యాంగ శక్తి, చట్టబద్ధ పరిపాలన పైచేయి సాధించాయి. ఒకనాడు 'ఎర్ర స్థావరం'గా ప్రాచుర్యం పొందిన ప్రాంతాలు ఇప్పుడు ప్రగతి కూడళ్లుగా, హరిత వృద్ధి గాథను చాటే గళాలుగా మారాయి. భయం నీడన, అంధకారంలో మగ్గిన ప్రాంతాలన్నిటా నేడు ప్రగతి కాంతులు ప్రసరిస్తున్నాయి. దశాబ్దాలుగా దేశాన్ని వేధించిన ఈ బెడదను నిర్దిష్ట కాలవ్యవధిలో, క్రమపద్ధతి ద్వారా నిర్మూలించడంతో 'నక్సల్ విముక్త భారత్'పై ప్రభుత్వం శపథం చారిత్రక విజయంగా రూపుదిద్దుకుంది. ఇది నిస్సందేహంగా దేశం ఎంతో గర్వించదగిన ఘట్టం. 'ఎర్ర స్థావరం' నుంచి నక్సలిజం విముక్త భారత్ వరకు (2014-2026) పటిష్ఠ భద్రత చర్యలు, మౌలిక సదుపాయాల కల్పన, సక్సలైట్ల ఆర్థిక మూలాల నిర్మూలన, లొంగుబాటు విధానంతో కూడిన కేంద్ర ప్రభుత్వ వ్యూహం సానుకూల ఫలితాలిచ్చింది. స్వతంత్రం తర్వాత భారత్ ఎదుర్కొన్న అత్యంత సంక్లిష్ట భద్రత సవాళ్లలో వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం) ఒకటి. దీనివల్ల ప్రభావితమైన రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రాంతాలను నక్సలిజం నుంచి విముక్తం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ దిశగా చేపట్టిన వివిధ రకాల చర్యలివే. జాతీయ విధానం కార్యాచరణ ప్రణాళిక - 2015 నక్సలిజం సమూల నిర్మూలన లక్ష్యంగా "వామపక్ష తీవ్రవాద వ్యతిరేక జాతీయ విధానం- కార్యాచరణ ప్రణాళిక'ను 2016లో ప్రభుత్వం ఆమోదించింది. అనేక భద్రత చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమాజాల హక్కులు-అధికారాలకు భరోసా వంటి వ్యూహాలకు ప్రాధాన్యంతో ఈ చట్రం రూపొందింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల మోహరింపు, ఇండియా రిజర్వ్ బెటాలియన్ల ఏర్పాటు. హెలికాఫ్టర్ తోడ్పాటు, పోలీసు బలగాలకు శిక్షణ-ఆధునికీకరణ, తగినన్ని విధుల లభ్యత, ఆయుధాలు-పరికరాల సరఫరా వగైరాలను తన వ్యూహంలో భాగం చేసింది. వీటన్నిటితోపాటు నిఘా సమావార ఆదాన ప్రదానం, పటిష్ఠ పోలీస్ స్టేషన్ల నిర్మాణం వంటి కార్యకలాపాలను కూడా చేపట్టింది. ₹3681.73 కోట్ల మేర నిధులను వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సామర్థ్యం పెంచేందుకుగాను 2014-15 నుంచి 'భద్రత సంబంధ వ్యయ పథకం' (ఎస్ఆర్ఎస్) కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. నిరంతర తగ్గుముఖం పట్టిన హింస జాతీయ విధానం కార్యాచరణ ప్రణాళిక-2015' అమలుతో హింప తగ్గుముఖం పడుతూ వచ్చింది. జాతీయ భద్రతకు అత్యంత ముప్పుగా పరిణమించిన వామపక్ష తీవ్రవాదం అదుపులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా 2014లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య 126 కాగ , 2025 నాటికి 11 జిల్లాలకు పరిమితమైంది. మొత్తం 1,022 మందిని అరెస్టు చేయగా, 2,337 మంచి లొంగిపోయారు. 24 మంది నక్సలైట్లు 2025 మే 23న లొంగిపోయారు. 197 మంది నక్సలైట్లు చత్తీస్గడ్ లోనూ, 61 మంది మహారాష్ట్రలోనూ 2025 అక్టోబరులో లొంగిపోయారు. 7,409 మంది 2019 జనవరి 15 నుంచి 2026 మధ్య అరెస్టు కాగా, 5,880 మంది లొంగిపోయారు. పునరావాసం ప్రోత్సాహకాల ప్రభావం సుస్పష్టం పునరావాస విధానం కింద వామపక్ష తీవ్రవాద ఉన్నత శ్రేణులకు ₹5 లక్షలు, దిగువ శ్రేణులకు ₹2.5 లక్షల వంతున ప్రభుత్వం తక్షణ సాయంగా మంజూరు చేసింది. ₹50,000 వంతున లొంగినవారికి ప్రోత్సాహకం ఇవ్వగా, లొంగుబాటు సామూహికమైతే దీనికి రెట్టింపు మొత్తం. లొంగిపోయిన ప్రతి నక్సలైట్కూ ఒక మొబైల్ ఫోన్. ఆయుధాలు అప్పగిస్తే అదనపు పరిహారం మంజూరు. అంతేకాకుండా పునరావాస కేంద్రాల్లో వైపుల్యు దీక్షలు ఉపకరణాల పంపిణీ కూడా చేపట్టింది. ₹10,000 వంతున నెలవారీ సహాయంగా 36 నెలలపాటు మంజూరు సహా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారులందరికీ గృహ వసతి కల్పించింది. 'నక్సల్ విముక్తం'గా ప్రకటితమైన పంచాయతీల పరిధిలో అభివృద్ధి పనుల కోసం ₹1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అంచించింది. లొంగిపోయిన నక్సలైట్లలో పురుషులకు ₹5 లక్షలు, మహిళలకు ₹2 లక్షలు వంతున రుణం మంజూరు. దీంతోపాటు వారి పిల్లలకు 12వ తరగతి వరకూ ఉచిత విద్య. దిశను మార్చిన మూడు తేదీలు ప్రగతి సాధన కోసం 'ఏకోన్నుల ప్రభుత్వం' విధానాన్ని కేంద్రం అనుసరించింది. అనే తరహాలో తీవ్రవాదులకు ఉచ్చు బిగించేందుకు తర వ్యూహాన్ని 'ఏకోస్కులు నిమా సంస్థల వద్దతి' వైపు మళ్లించింది. తదనుగుణంగా మూడు నిర్దిష్ట తేదీలు పరిణామణీల మార్పు దిశగా బాటలు వేసాయి. 'ఏకోన్ముఖ నిఘా సంస్థల పద్ధతి' కింద నక్సలైట్ విధానాలు, వారికి విధులంటే మార్గాలు, మద్దతు వ్యవస్థలపై ఎన్ఐఏ', ఈడీ సహా వివిధ గూఢచార సంస్థలు సంయుక్త, బహుముఖ దాడి చేశాయి. ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం కింద నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.. 2019 ఆగస్టు 20: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక సమావేశం నిర్వహించి- బలగాల మధ్య సమన్వయం, పోలీసు వ్యవస్థ ఆధునికీకరణ, మాజీ వర్సలైట్లను బలగాల్లో చేర్చడం, గూడచారి సంస్థల మధ్య సమన్వయం వంటి అంశాలతో సమగ్ర ప్రణాళికకు రూపమిచ్చింది. 2024 ఆగస్టు 24: చత్తీస్‌గఢ్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో కేంద్ర హోం శాఖ మంత్రి ఆ రాష్ట్రాన్ని సందర్శించి, కేంద్ర-రాష్ట్ర సంయుక్త వ్యూహం దిశగా కృషి చేశారు. దీని అమలుతో 2026 మార్చి 31కల్లా నక్సలిజం నుంచి దేశం పూర్తిగా విముక్తం కాగలదని అదే రోజున అధికారిక ప్రకటన వెలువడింది. 2026 మార్చి 31: నక్సల్ విముక్త భారత్ లక్ష్య సాధన గడువుకు ఒకరోజు ముందుగానే కేంద్ర హోం మంత్రి లోక్ సభలో దేశం ఈ బెడద నుంచి పూర్తిగా విముక్తమైనట్లు అధికారికంగా ప్రకటించారు. పోలీసు బలగాల ఆధునికీకరణ 'పోలీసు బలగాల ఆధునికీకరణ' పథకం కింద రాష్ట్రాల పరిధిలో పోలీసు వ్యవస్థల బలోపేతానికి కేంద్రం ఆర్థిక సహాయం అందించింది. ఈ పథకం కింద రాష్ట్ర పోలీసు బలగాలకు ఆధునిక ఆయుధాలు సమాచార సాంకేతిక ఉపకరణాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, శిక్షణ, రవాణా, గృహవసతి తదితర మౌలిక సదుపాయాల కోసం నిధులు సమకూర్చింది. అలాగే ఉప పథకమైన ప్రత్యేక మౌలిక సదుపాయాల' కింద వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర నిఘా శాఖలు, జిల్లా పోలీసు విభాగాలు, పటిష్ట పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు సాయం అందించింది. భద్రత మౌలిక సదుపాయాల బలో పీతంలో భాగంగా మొత్తం 656 పటిష్ట పోలీసు స్టేషన్ల నిర్మాణానికి తోడ్పడింది. ₹1,224.59 కోట్లు ఈ పథకం కింద 2014-15 నుంచి కేంద్ర నిఘా సంస్థలకు అందజేసిన ఆర్థిక సహాయం. 596 - గత 11 సంవత్సరాల్లో ఏర్పాటు చేసిన పటిష్ఠ పోలీసు స్టేషన్ల సంఖ్య 350 - నక్సలైట్ సంఘటనలు నమోదైన పోలీసు స్టేషన్ల సంఖ్య. ఇప్పుడిది 60 కి పడిపోయింది. 406 - కేంద్ర సాయుధ బలగాల కోసం 2020 నుంచి ఏర్పాటు చేసిన కొత్త శిబిరాల సంఖ్య 68 - రాత్రివేళ హెలికాప్టర్లు దిగేందుకు నిర్మించిన హెలిపాడ్ల సంఖ్య 400 - సిబ్బంది కోసం సమకూర్చిన బుల్లెట్- పేలుడు నిరోధక వాహనాల సంఖ్య 05 - సాయుధ, నిఘా సిబ్బంది కోసం నిర్మించిన ఆస్పత్రుల సంఖ్య- దీంతోపాటు కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉన్నతీకరణ. నిధుల లభ్యత నిరోధక చర్యలు వామపక్ష తీవ్రవాద గ్రూపులకు నిధుల లభ్యతను నిరోధించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు), దానికి ఆర్థిక మద్దతిచ్చే వర్గాలకు మధ్య గల సంబంధాన్ని ఛేదించేందుకు నిరంతర చర్యలు తీసుకుంది. తద్వారా వారికీ నిధులు, వనరుల సరఫరాను నిరోధించేలా రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర సంస్థలు సమన్వయంతో సమర్థ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా అమలు చేసిన కొన్ని చర్యలివే: తీవ్రవాదులకు నిధుల లభ్యతను అరికట్టే దిశగా 2011లో కేంద్ర హోం శాఖ కింద కౌంటరింగ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ (సీటీఎఫ్) సెల్‌ను ఏర్పాటు చేశారు. ఇది వివిధ గూఢచార, చట్టం అమలు సంస్థలతో సమన్వయం ద్వారా తీవ్రవాద ఆర్థిక వలయంపై నిఘా వేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా టెర్రర్ ఫండింగ్ అండ్ ఫేక్ కరెన్సీ సెల్ (టీఎఫ్ఎస్సీ) ఏర్పాటు చేసింది. ఇది ఉగ్రవాదులకు నిధుల కేసులు, భారత కరెన్సీకి నకిలీ నోట్ల (ఎఫ్ఐపిఎన్) ముద్రణ కేసులపై దర్యాప్తు ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంది. దేశంలో 'ఎఫ్ఐపిఎన్ 'చలామణీ నిరోధం కోసం 'ఎఫ్ఐపిఎన్ కో-ఆర్డినేషన్ సెంటర్' కూడా ఏర్పాటైంది. ఇది కేంద్ర, రాష్ట్ర స్థాయి భద్రత సంస్థల మధ్య గూఢచార-నిఘా సమాచార ఆదానప్రదాన సౌలభ్యం కల్పించింది. ఉగ్రవాద సంస్థలు, వాటి సభ్యులపై ఐక్యరాజ్య సమితి భద్రత మండలి తీర్మానాల ప్రాతిపదికన ప్రభుత్వం పలు చట్టబద్ధ ఆంక్షలు విధించి విధులు, ఆస్తుల స్తంభన-స్వాధీనం వంటి చర్యలు చేపట్టింది. హోం మంత్రిత్వ శాఖలో రెండు బహుళశాఖా బృందాలను 2016లో ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి-కేంద్ర స్థాయిలో, మరొకటి రాష్ట్రాల స్థాయిలో పనిచేశాయి. ఈ రెండూ వామపక్ష తీవ్రవాద శ్రేణులకు నిధుల సరఫరా నిరోధక చర్యలను పర్యవేక్షించాయి. ₹40 కోట్ల విలువైన ఆస్తులను నక్సల్ నిధుల నిరోధక విభాగం ద్వారా 'ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. మరోవైపు రాష్ట్రాలు కూడా ₹40 కోట్లకు పైగా సొమ్ము స్వాధీనం చేసుకుని, నక్సలైట్లకు నిధులను అరికట్టింది. ₹12 కోట్ల నిధులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వివిధ కేసులతో ముడిపెట్టింది. దీంతో పట్టణ నక్సల్స్'కు నైతికంగా, మానసికంగా భారీ దెబ్బ తగలడమేగాక సమాచార పోరులో ప్రభుత్వ పట్టు మరింత బిగిసింది. ప్రగతి ప్రాధాన్య చర్యలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రధాన పథకాల అమలుకు తోడు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వీటిలో భాగంగా రహదారి నెట్వర్క్ విస్తరణ. టెలికం సంధానం మెరుగుదల, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సార్వజనీనత వంటి వాటికి అత్యంత ప్రాముఖ్యమిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కొన్నిటి వివరాలిలా ఉన్నాయి: రహదారి నెట్వర్క్ బలోపేతం కోసం- రోడ్ రిక్వెర్మెంట్ ప్లాన్' (ఆర్ఆర్సీ) సహా రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఫర్ ఎల్‌డబ్ల్యూఈ అఫెక్టడ్ ఏరియాస్" (ఆర్సీన్ఎల్డబ్ల్యూఈఎ) పేరిట ప్రత్యేక పథకాలను ప్రభుత్వం అమలు చేసింది. 17,589 కిలోమీటర్ల రహదారుల నెట్వర్క్ నిర్మాణానికి ఆమోదం లభించగా, 12,000 కిలోమీటర్ల దాకా పనులు పూర్తయ్యాయి. 6,025 తపాలా కార్యాలయాల ద్వారా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల సౌలభ్యం కల్పించారు. వాముపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో టెలికం అనుసంధానం మెరుగుదల కోసం 9,223 మొబైల్ టవర్లను నిర్మించారు. నైపుణ్యాభివృద్ధి కోసం 48 పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐ), 49 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యనందించేందుకు 259 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేశారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో కొత్తగా 1,804 బ్యాంక్ శఖలు 1,321 ఏటీఎంలు ఏర్పాటు కాగా 37850 మంది బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు నియమితులయ్యారు. ప్రభుత్వం 2017లో ప్రారంభించిన కేంద్ర ప్రత్యేక సహాయ పథకం కింద తీవ్ర ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వ మౌలిక సదుపాయాల అంతరం భర్తీ నిమిత్తం ఇప్పటిదాకా ₹3,953,67 కోట్లు విడుదల చేసింది. ప్రధానమంత్రి 2024 అక్టోబరు 2న జార్ఖండ్ నుంచి 'ధర్తీ ఆబా ఇన్జాతీయ గ్రామ్ ఉత్కర్స్ అభియాన్ 'కు శ్రీకారం చుట్టారు. దేశంలోని 15,000 గ్రామాల్లో కనీస వసతుల కల్పన ఈ కార్యక్రమ లక్ష్యం. అంతేకాకుండా రహదారి, మొబైల్, ఆర్థిక (3 సి'లు) సేవల అనుసంధానానికి ప్రభుత్వం నిరంతర కృషి కొనసాగిస్తోంది. తద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం సహా ప్రగతి వేగాన్ని పెంచాలని నిర్ణయించింది. 240 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని జగదల్పూర్లో నిర్మించారు. అంతకుముందు ఈ ప్రాంతంలో కనీసం ప్రాథమిక-సామాజిక ఆరోగ్య కేంద్రాలు కూడా ఉండేవి కాదు. 2,212 కోట్ల విలువైన పనులను పౌర కార్యాచరణ కార్యక్రమం కింద చేపట్టారు. ఇందులో భాగంగా ఆరోగ్య శిబిరాల నిర్వహణ సహా మందులు పంపిణీ చేస్తున్నారు. ఆ గిరిజన యువతరం కోసం ఆదానప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాల కోసం ప్రత్యేక భద్రత వ్యయ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ₹3,000 కోట్ల నిధులను పదేళ్ల వ్యవధిలో కేటాయించారు. ₹5,000 కోట్ల నిధులను పత్యేక మౌలిక సదుపాయాల పథకం కింద కేటాయించారు. 2,000 కోట్ల దాకా విధులను విస్తరిత ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం కింద అదనంగా కేటాయించారు. ₹4,000 కోట్ల దాకా నిధులను కీలక ప్రభుత్వ మౌలిక సదుపాయాల కోసం కేటాయించారు. బస్తర్ అభివృద్ధిలో కొత్త కోణాలు బస్తర్ ప్రాంతంలో నక్సలిజం దాదాపు అంతమైపోయింది. ఈ దిశగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో ఒక పాఠశాల ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో ఒక రేషన్ దుకాణం కూడా తెరిచారు. ప్రతి తాలూకాలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామగ్రామాన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలందరికీ ఆధార్, రేషన్ కార్డుల జారీతోపాటు ఉచితంగా 5 కిలోల ఆహార ధాన్యాలు సహా వంటగ్యాస్ అందించారు.. "బస్తర్ ఒలింపిక్స్, బస్తర్ పండుమ్" వంటి క్రీడా ప్రోత్సాహక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 1.20 లక్షల మంది కళాకారులు 'బస్తర్ పండుమ్'లో పాల్గొన్నారు. 5.50 లక్షల మంది గిరిజనులు క్రీడా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ప్రత్యేక న్యాయస్థానాలు జాతీయ స్థాయిలో 'ఎన్ఐఏ' బలోపేతం కాగా, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో 'రాష్ట్ర దర్యాప్తు సంస్థలు" (ఎన్ఐఏ) లు కూడా ఏర్పాటయ్యాయి. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 4 వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల ప్రత్యేక కోర్టులతోపాటు ఈ కేసుల విచారణ కోసం ఇతర రాష్ట్రాల్లోనూ ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యాయి. 280 కొత్త శిబిరాలతోపాటు రాష్ట్ర పోలీసు విభాగాలకు సహకరించడం కోసం 2019 నుంచి 15 సంయుక్త కార్యాచరణ బృందాల ఏర్పాటు సహా 6 సీఆర్పీఎఫ్ బెటాలియన్లను కూడా మోహరించారు. ఆధారం: న్యూ ఇండియా సమాచార్