కుటుంబాలకు రక్షణ భవిష్యత్తుకు భరోసా పీఎంఎస్ బీవై, పీఎంజేజేబీవై, ఏపీవై పథకాలకు 11 ఏళ్లు సామాన్యుల కలలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడమే కాకుండా, అందరికీ సామాజిక భద్రత కల్పించడమే ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ స్ఫూర్తితో ప్రతి పౌరుడికి ఆర్థిక అండగా నిలవడమే ప్రాధాన్యతగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ఆశయంతోనే సరిగ్గా 11 ఏళ్ల క్రితం 2015 మే 9వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడు కీలకమైన సామాజిక భద్రతా పథకాలను ప్రారంభించారు. అవి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన. ఈ పథకాలు విజయవంతంగా 11 సంవత్సరాలను పూర్తి చేసుకున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ మూడు ప్రజా సామాజిక భద్రతా పథకాలు ఎంత భారీ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లాయో, ఇప్పటివరకు నమోదైన 92 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ల గణాంకాలే నిదర్శనం. 2014 సంవత్సరం వరకు దేశ జనాభాలో సుమారు 80 నుంచి 90 శాతం మందికి ఎటువంటి బీమా సౌకర్యం గానీ, భవిష్యత్తులో పెన్షన్ వస్తుందన్న నమ్మకం గానీ ఉండేది కాదు. సులభంగా చెప్పాలంటే 100 కోట్లకు పైగా ప్రజలు ఎటువంటి ఆర్థిక రక్షణ కవచం లేకుండానే జీవనం సాగించేవారు. ఈ నేపథ్యాన్ని మార్చివేస్తూ పేదలు, విస్సహాయుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను, సున్నితత్వాన్ని చాటిచెబుతూ 2015 మే 9వ తేదీన పశ్చిమ బెంగాల్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకేసారి రెండు బీమా పథకాలను, ఒక పెన్షన్ పథకాన్ని ప్రారంభించారు. పేదలు కేవలం ఉచిత పథకాలను కోరుకోవడం లేదని, వారు అశిస్తున్నది కేవలం సాధికార మాత్రమేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పేద ప్రజలకు సరైన సాధికారత కల్పిస్తే, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించడానికి పూర్తిగా సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక పథకాలు నేడు కోట్లాది మంది జీవితాల్లో భరోసాను నింపుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ఇప్పటివరకు 57 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ లభించిందని, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా 26 కోట్లకు పైగా మంది ఈ బీమా పథకం పరిధిలోకి వచ్చారు. అలాగే అటల్ పెన్షన్ యోజన ద్వారా8 71 కోట్ల మందికి పైగా ఈ పథకంలో భాగస్వాములయ్యారు. కేవలం రెండు బీమా పథకాల ద్వారా సుమారు 11 లక్షల కుటుంబాలకు ఇప్పటివరకు రూ. 21,500 కోట్లకు పైగా క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించారు. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన 57.11 కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదు ఇది అమెరికా జనాభా కంటే అధికం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 26.31 కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదు ఇది పాకిస్థాన్ జనాభా కంటే అధికం అటల్ పెన్షన్ యోజన 8.71 కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదు ఇది జర్మనీ జనాభా కంటే అధికం ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన గురించి మరిన్ని వివరాలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఒక వార్షిక వ్యక్తిగత ప్రమాద బీమా పథరం దీనిని ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవచ్చు ఒకవేళ ప్రమాదవశాత్తు మరణించినా లేదా పూర్తిగా శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ.2 లక్షల పరిహారం అందిస్తుంది. అలాగే పాక్షిక శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.1 లక్ష పరిహారం అందిస్తుంది. ఈ పథకానికి అయ్యే వార్షిక రుసుము కేవలం రూ.20 మాత్రమే.. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారందరూ ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో చేరాలనుకునే దరఖాస్తుదారునికి తప్పనిసరిగా ఏదైనా బ్యాంకులో ఖాతా ఉండాలి. పీఎంజేజేబీవై గురించి సమగ్ర వివరాలు ఈ పధకంలో చేరడానికి కనీస వయస్సు 18 ఏళ్లు కాగా, గరిష్ఠ వయస్సు 50 ఏళ్లు. ఆసక్తి గల వారు తమ సమీపంలోని బ్యాంకు శాఖలు, తపాలా కార్యాలయాలు, లేదా ఆన్ లైన్ లో నేరుగా నమోదు చేసుకోవచ్చు. సంవత్సరానికి కేవలం రూ. 436 చెల్లిస్తే సరిపోతుంది. బీమా వర్తించే కాలంలో పాలసీదారుడు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి కుటుయీ రూ.2 లక్షల పరిహారం అందుతుంది. మరణానికి గల కారణంతో సంబంధం లేకుండా ఈ పరిహారం చెల్లిస్తారు. ఈ పథకంలో చేరడానికి అభ్యర్థికి ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఖాతా ఉండటం తప్పనిసరి. ప్రీమియం మొత్తాన్ని ఖాతా నుంచి నేరుగా మినహాయించుకునేలా 'ఆటో డెబిట్' సదుపాయానికి అనుమతి అవ్వాల్సి ఉంటుంది. గమనిక: పీఎంజేజే లబ్దిదారులు 53% మహిళలు 74% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు. అటల్ పెన్షన్ యోజన గురించి పూర్తి వివరాలు ప్రభుత్వం హామీని కల్పించే మొట్టమొదటి పెన్సన్ పథకం ఇదే. ఒకవేళ పథకంలో జమ అయ్యే నిధుల్లో మీ వాటాలు తక్కువగా ఉన్నట్లయితే ఆ లోటును కేంద్ర ప్రభుత్వమే భరించి చందాదారులకు భరోసా కల్పిస్తుంది. ఈ పథకం విజమైన లబ్ధిదారులకు చేరాలనే ఉద్దేశంతో అక్టోబర్ 1, 2022 నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులను పథకంలో చేరకుండా కేంద్రం నిరోదించింది. చందాదారులు తమ ఎంపికను బట్టి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ. 5,000 వరకు ఖచ్చితమైన పెన్సన్ పొందుతారు. పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే, అదే పెన్సన్ మొత్తాన్ని వారి జీవిత భాగస్వామి. పొందుతారు. దురదృష్టవశాత్తు భార్యాభర్తలు ఇద్దరూ మరణించిన సందర్భంలో అప్పటివరకు ఆమ అయిన మొత్తం పెన్షన్ నిధిని నామినీకి తిరిగి చెల్లిస్తారు. ఈ పథకంలో చేరే వయసు, ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి నెలవారీ చెల్లించాల్సిన మొత్తం కనిష్టంగా రూ.42 మంచి గరిష్టంగా రూ.1,454 వరకు ఉంటుంది. ఆధారం: న్యూ ఇండియా సమాచార్