ప్రజల జీవనాన్ని మరింత సరళం చేసే ప్రక్రియలో భాగంగా ఎల్.పి.జి సిలిండర్లు బుక్ చేసుకునేందుకు మిస్ట్ కాల్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు "8454955555 నంబర్ కి మిస్ట్ కాల్ ఇచ్చి రీఫీల్ బుక్ చేసుకోవచ్చు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో అయితే ఈ నంబర్ ను కొత్త కనెక్షన్ కు కూడా ఉపయోగించవచ్చు. తదుపరి దశలో ఈ సర్వీసును దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు. మిస్ట్ కాల్ వాయిస్ ఇంటరాక్టివ్ రెస్పాన్స్ వ్యవస్థ (ఐవిఆర్ఎస్) సత్వర బుకింగ్ కు వీలు కల్పిస్తుంది; కస్టమర్లు ఎక్కువ సమయం పాటు కాల్ హోల్డ్ చేయాల్సి న అవసరం ఉండదు. ప్రజారోగ్య వ్యవస్థలకు ఆక్సిజెన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ. 201 కోట్లు కేటాయించిన పిఎం కేర్స్ ఫండ్ పేఎం కేర్స్ ఫండ్ ట్రప్ న్ రి వశంలోని' ప్రజారోగ్య, కేంద్రాల్లో 162 ప్రెషర్ స్వింగ్ అబ్దార్ ప్షన్(పిఎస్ఎ) మెడికల్ ఆక్సిజెన్ ప్లాంట్ల _ ఏర్పాటు కోసం రూ. 201.58 కోట్లు కేటాయించింది. 52 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 154.19 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. కరోనా మహమ్మారి కాలంలో ఆక్సిజన్ తగినంతగా, నిరంతరాయంగా సరఫరా చేయడం తప్పనిసరి. ఎ౦.ఎసన్.పి కింద 2020-21 ఆర్దిక సంవత్సరంలో 23.41% పెరిగోన్ ధాన్యం సేకరణ 2020-21 ఖరీఫ్ లో ధాన్యం సేకరణ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 23.41 శాతం పెరిగింది. 2021 జనవరి 20వ తేదీ వరకు 575.56 ఎల్ఎంటి (లక్ష మెట్రిక్ టన్నులు) ధాన్యాన్ని సేకరించారు. గత ఏడాది ఇదే సమయంలో సేకరించిన ధాన్యం 466.22 ఎల్ఎంటి. సేకరించిన మొత్తం ధాన్యం 575.36 ఎల్ఎంటిలో 355.24 శాతం అంటే 202.77 ఎల్ఎంటి వాటా పంజాబ్ దే. 2014 సంవత్సరం నుంచి పంటల ఉత్పత్తి వ్యయాలపై 1.5 రెట్లు ఎం.ఎస్.పిగా రైతులకు చెల్లిస్తున్నారు. ధాన్యం ఎం.ఎస్.పి 2.4 రెట్లు పెరిగింది. సామాన్య మానవునికి వరంగా మారిన ఇ-సంజీవని కోవిద్-19 కారణంగా సురక్షితమైన దూరం ఒక సామాజిక నిబంధనగా మారిన నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహణలోని ఇ సంజీవని టెలీ మెడిసిన్ సర్వీసు ఒక వరంగా నిలిచింది. ఇప్పటివరకు టెలీ కన్సల్టేషన్ల సంఖ్య పది లక్షల మైలురాయిని దాటింది. తమిళనాడు 5.74 లక్షల టెలీ కన్సల్టేషన్లతో అధిక కేసులు నమోదు చేసింది. ఇదిలా ఉండగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు 2020 సంవత్సరంలో 5.79 కోట్ల మధుమేహం, 7.15 కోట్ల రక్తపోటు పరీక్షలు నిర్వహించాయి. 2025 నాటికి యుకను దాటి ఐదో పెద్ద ఆర్థిక వ్య వస్థగా మారనున్న భారత్ భరతదేశం 2025 నాటికి యుకెను దాటి ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని, 2030 నాటికి మూడో స్థానానికి చేరుతుందని యుకెకు చెందిన మేధావుల సంస్థ అంచనా వేసింది. భారతదేశం కొవిడ్-19 వల్ల ప్రభావితం కావడం కన్నా ముందు 2019లోనే యుకెను దాటి ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది. కాగా 2025 నాటికి యుకెను, 2027 నాటికి జర్మనీని, 2050 నాటికి జపాన్ ను భారత ఆర్థిక వ్యవస్థ అధిగమిస్తుందని యుకె సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ అంచనా వేసింది. 2021లో భారత ఆర్థిక వ్యవస్థ 9 శాతం వృద్ధిని సాధిస్తుందని కూడా ఆ సంస్ధ తెలిపింది. ఆధారం : న్యూ ఇండియా సమాచార్