దేశంలో గిరిజన చరిత్ర అతి పురాతనమైనది. వారి వికాసం భిన్నమైనది. అడవుల్లో అనాదిగా ఆదివాసులు జీవిస్తున్నారు. తమదైన సంస్కృతీ సంప్రదాయాలతో విలసిల్లుతున్న గిరి పుత్రుల అభివృద్దికి రాజ్యాంగ నిర్మాతలు వారి సంక్షేమంతో పాటు వారికి కొన్ని హక్కులను ప్రసాదించారు. వారికోసం ప్రత్యేక చట్టాలు కూడా చేసారు. వాటిల్లో కొన్ని మీకోసం. 15వ అధికరణ విద్యాపరంగా ఆర్ధికంగా వెనుక పడిన షెడ్యూల్ కులాల, తెగల ప్రభుత్వం ప్రత్యేక నిబందనలు చేయవచ్చు. 16 వ అధికరణ ప్రభుత్వ సర్వీసులలో వెనుకబడిన వారికి తగినంత ప్రాతినిద్యం లభించడం లేదని ప్రభుత్వం భావించినపుడు ప్రత్యేక నిభందనలు చేయడానికి ఆటంకం లేదని చెప్తుంది 46వ అధికరణ హరిజన గిరిజన తెగలకు చెందిన ప్రజల ఆర్ధికాభివృద్దికి ప్రత్యేక శ్రద్ద వహించాలని అన్ని రకాల దోపిడీ నుండి రక్షణ కల్పించాలని ఈ అధికరణం తెలియజేస్తుంది 244 వ అధికరణ ఏ ప్రాంతాన్నైనా షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనుల భూముల బడలాయిమ్పును నిషేదించడానికి ఆయా ప్రాంతాల్లో శాంతిని పెంచుతూ నిబంధనలు చేసే అధికారం గవర్నర్ కు ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో గిరిజన శాసన సభ్యులతో కూడిన గిరిజన సలహామండలి సలహాలను పొందాలి. 275 అధికరణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో సమానంగా షెడ్యూల్ ప్రాంతాలలో రాష్ట్రనికర ఆదాయాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్రం వివిధ పధకాలను భారత సంచిత నిధినుండి ఖర్చు చేయవచ్చు 330, 322, 334 అధికరణాలు శాసన సభ పార్లమంట్ స్థానాలను షెడ్యూల్తెగల వారికి కేటాయించాలి 338 అధికరణ ప్రత్యేక అధికారి ద్వారా రక్షణ నియమాల అమలు తీరును రాష్ట్రపతి కోరవచ్చు 339 అధికరణ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన తీరుపై ఒకసంఘాన్ని రాష్త్రపతి నియమించవచ్చు 342 అధికరణ ఏ జాతినైన షెడ్యూల్ తెగల మరియు వాటి గ్రూపులుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది